తెలంగాణ

telangana

By

Published : Feb 12, 2021, 10:25 PM IST

ETV Bharat / crime

'అసిస్టెంట్ సిటీ ప్లానర్ లంచాలు తీసుకుంటున్నారు'

వరంగల్ మహానగర పాలక సంస్థ ఎనిమిదో డివిజన్​​లో.. డిప్యూటీ కమిషనర్ పర్యటించారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి.. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలెందుకు తీసుకోలేదంటూ వారిని నిలదీశారు.

Warangal metropolitan government officials have finally responded to the illegal structures
'అసిస్టెంట్ సిటీ ప్లానర్ లంచాలు తీసుకుంటున్నారు'

అక్రమ నిర్మాణాలపై వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఎనిమిదో డివిజన్ రంగసాయి పేట గణేశ్​నగర్​లో.. బిల్డర్లు అక్రమ కట్టడాలు చేపడుతున్నారనే ఫిర్యాదులు అందడంతో.. డిప్యూటీ కమిషనర్ రాజు రంగంలోకి దిగారు. కాలనీలోని ప్రతీ వీధిని పరిశీలించారు.

అక్రమ నిర్మాణాలను గుర్తించిన డిప్యూటీ కమిషనర్.. టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అసిస్టెంట్ సిటీ ప్లానర్ లంచాలు తీసుకుంటూ బిల్డర్లకు సహకరిస్తున్నారని స్థానికులు.. డిప్యూటీ కమిషనర్ ఎదుట వాపోయారు. విచారణ అనంతరం.. చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు ఆయన హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:కేసీఆర్ హామీలిస్తారు కానీ అమలు మాత్రం చేయరు: జానారెడ్డి

ABOUT THE AUTHOR

...view details