తెలంగాణ

telangana

ETV Bharat / crime

SUICIDE: గౌరవ వేతనం సరిపోవట్లేదంటూ.. వాలంటీర్‌ ఆత్మహత్య - కోడుమూరు గ్రామ వాలంటీర్‌ హబీబ్‌బాషా

ఏపీలోని కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామ వాలంటీర్‌ హబీబ్‌బాషా (26) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం.. పెళ్లయ్యాక కుటుంబ పోషణకు సరిపోదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

SUICIDE
SUICIDE

By

Published : Aug 17, 2021, 5:22 PM IST

కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్న హబీబ్‌బాషా (26) మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కోడుమూరులోని సుందరయ్య నగర్‌లో ఉంటున్న అబ్దుల్‌ఖాదర్, జహినాబీకి ఇద్దరు కుమారులు హబీబ్, మాలిక్‌ బాషా ఉన్నారు. వారి ఇద్దరు కుమారులకు ఇటీవలే నిశ్ఛితార్థమైంది.

పెద్ద కొడుకు హబీబ్‌ బాషా కోడుమూరులోని గ్రామ సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. తనకు పెళ్లైతే వాలంటీర్‌గా వచ్చే గౌరవ వేతనం ఏ మాత్రం సరిపోదని, కుటుంబాన్ని పోషించటం కష్టంగా మారుతుందని తండ్రికి చెప్పేవారు. మరో ఉద్యోగం వచ్చేంతవరకు వాలంటీర్‌గానే పనిచేయమని తండ్రి సూచించారు. దీంతో నిత్యం మనోవేదనకు గురైన అతను సోమవారం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

భోజనం చేసేందుకని ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. విగతజీవిగా మారిన కుమారుడిని చూసి బోరున విలపించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. చేతికి అందివచ్చిన కుమారుడు కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకుంటే.. లోకాన్నే వదిలి వెళ్లిపోయాడంటూ తల్లిదండ్రులు విలపించిన తీరు అక్కడున్నవారినీ కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై

ఇదీచూడండి:Gandhi Hospital Rape: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం... పోలీసుల అదుపులో నలుగురు

ABOUT THE AUTHOR

...view details