సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. తన కారులో ఏపీఆర్ కాలనీకి వెళ్లేందుకు గేట్ వద్దకు వచ్చాడు. కొవిడ్ నిబంధన దృష్ట్యా వివరాలు తెలుసుకునేందుకు సెక్యూరిటీ గార్డు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన విష్ణువర్ధన్ రెడ్డి... నేనెవరో నీకు తెలియదా అంటూ అతనిపై దాడి చేశాడు.
ఎమ్మెల్యే కుమారుడు హల్చల్.. సెక్యూరిటీ గార్డుపై దాడి - telangana news
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి సెక్యూరిటీ గార్డుపై దాడి చేయడం కలకలం రేపింది. తన కారులో ఏపీఆర్ కాలనీలోకి వెళ్లేక్రమంలో కొవిడ్ నిబంధన దృష్ట్యా సెక్యూరిటీ గార్డు వివరాలు అడగగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎమ్మెల్యే కుమారుడు హల్చల్
ఈ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో నమోదు కావటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తనపై దాడి చేసినట్లుగా పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఎవరూ ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం. దీనిపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి... గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు.
ఇదీ చదవండి:సాగర్‌లో కరోనా కలకలం... ఒక్కరోజే 174 మందికి వైరస్
Last Updated : Apr 20, 2021, 8:46 AM IST