MURDER: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఎంవీపీ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రూ.500 వ్యవహారంలో అప్పలరెడ్డి అనే వ్యక్తిని రౌడీషీటర్ శంకర్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. పెదవాల్తేర్ మునసబు వీధిలో అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వాలని అప్పలరెడ్డి అడిగితే దాడి చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాత్రి డబ్బులు ఇచ్చేందుకు బైక్‌పై వచ్చిన రౌడీషీటర్ శంకర్.. అప్పలరెడ్డి గొంతు కోసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిలో విచారణ చేస్తున్నారు. మృతుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ.. రాత్రి పూట మద్యం విక్రయిస్తాడని సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
MURDER: విశాఖలో దారుణం.. అప్పు ఇవ్వాలని అడిగిన వ్యక్తి హత్య - విశాఖలో వ్యక్తి దారుణ హత్య
MURDER: ఏపీలోని విశాఖ ఎంవీపీ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రూ.500 వ్యవహారంలో అప్పలరెడ్డి అనే వ్యక్తిని రౌడీషీటర్ శంకర్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. పెదవాల్తేర్ మునసబు వీధిలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
హత్య