ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో దారుణం జరిగింది. గురుమూర్తి అనే వ్యక్తి 60 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి చెవి కమ్మలు లాక్కొని తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అత్యాచారానికి యత్నించబోయాడు. గమనించిన గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని చెట్టుకు కట్టి దేహశుద్ధి చేశారు.
వృద్ధురాలిపై అత్యాచారయత్నం .. బండరాయితో కొట్టి చంపిన గ్రామస్థులు - Chittoor crime news
ఏపీలోని చిత్తూరుజిల్లాలో దారుణం జరిగింది. వృద్ధురాలిపై దాడిచేసి చెవి కమ్మలు లాక్కొన్నాడు. అనంతరం ఆమెపై అత్యాచారయత్నానికి యత్నించాడు. గమనించిన స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం కొందరు.. గురుమూర్తి తలపై కొట్టడంలో అక్కడికక్కడే మరణించాడు.
వృద్ధురాలిపై అత్యాచారయత్నం
తలపై బండరాయితో కొట్టడంతో గురుమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గురుమూర్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
ఇవీచూడండి:'కొవిడ్ రోగుల్లో మరణాలకు కారణమిదే..!'