తెలంగాణ

telangana

ETV Bharat / crime

BIKE FIRE: ' పోలీసోళ్లు ఊకె ఫొటో కొడ్తున్నరని... బండి తగులబెట్టిన..' - telangana top news

మద్యం మత్తులో... తన ద్విచక్రవాహనంపై పోలీసులు తరచూ చలాన్లు విధిస్తున్నారని వాహనాన్ని తుగులబెట్టుకున్నాడో యువకుడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్​లో జరిగింది.

vikarabad-man-sets-bike-on-fire-after-he-was-challaned
ఊకె ఫొటో కొడ్తున్నరని.. బండి తగులబెట్టిన..

By

Published : Aug 9, 2021, 12:40 PM IST

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన తలారి సంగప్ప దినసరి కూలీగా పని చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆదివారం తాండూర్ మండలం బాచుపల్లికి వెళ్లాడు. పని పూర్తి చేసుకొని తన బైకుపై ఇంటికి పయనమయ్యాడు. గౌతాపూర్​ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శిరస్త్రామం ధరించకపోవడంతో సంగప్పను ఆపారు. అనంతరం చలానా కూడా వేశారు. అప్పటికే ఆ ద్విచక్రవాహనంపై చలాన్లు ఉండగా.. రూ.5500 చెల్లించాల్సి ఉంది.

ఊకె ఫొటో కొడ్తున్నరని.. బండి తగులబెట్టిన..

5500 రూపాయలు కట్టాలే ఇప్పటికే. తప్పిస్కోని అస్తుంటే మస్తు ఫొటోలు కొట్టిరు మళ్లా. ఆళ్లతోటి బాధైంది. అందుకనే అంటివెట్న. ఆ బండి అంటివెట్న. పోలీసొల్ల బాధతోనే ఆ బండి అంటివెట్న. చలాన్లేసిర్రు.. 5500 అయింది. ఎవడు కడ్తడు మాకు. మేము కష్టం చేసుకొని బతికేటోళ్లం. బాసుపల్లికి పోయొచ్చిన. గౌతాపూర్ చెక్​పోస్ట్ కాడ పట్టుకున్నరు. నాకు తిక్కలేసింది. పుల్ల గీకి అంటవెట్టేస్న. వాళ్లు... ఇట్ల ముంగట పోతుంటే ఎన్కనుంచి ఫొటోలు కొడ్తున్నరు. అదెవరికి తెలుస్తది. అందుకే బాధతోటి అంటివెట్టేశ్న. కేసీఆర్ ప్రభుత్వం వల్లనే. - తలారి సంగప్ప, పెద్దేముల్

అక్కడినుంచి పెద్దేముల్​కు చేరుకున్న యువకుడు... చరచూ తన బైకుపై చలాన్లు విధిస్తున్నారని బైకును తగులబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే సంగప్ప మద్యం సేవించి ఉండడంతో... సహకార సంఘం కార్యాలయం వెనకాల ద్విచక్ర వాహనాన్ని కాల్చివేశాడు. రోజు కూలి చేస్తేనే.. తమ పొట్ట నిండుతుందని.. ఇంకా చలాన్లు కట్టే స్తోమత నాకెక్కడుందంటూ మద్యం మత్తులోనే ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి:ఏపీ, తెలంగాణలో తగ్గిన బంగారం, వెండి ధరలు

ABOUT THE AUTHOR

...view details