వికారాబాద్ జిల్లా గెరిగేట్పల్లిలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును వికారాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితుడు ధారూరు మండలం అల్లిపూర్‌కు చెందిన మాల కిష్టప్పగా తేల్చారు. అవుసుపల్లి గ్రామానికి చెందిన అమృతమ్మ కూలీ పనుల కోసం ఫిబ్రవరి 25న వికారాబాద్‌లోని కుంది అడ్డ వద్దకు వచ్చింది. ఆమెను గమనించిన కిష్టప్ప... తాను పని కల్పిస్తానని బాధితురాలిని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. వెళ్తుండగా దారిలో ఆమెకు కల్లు తాగించాడు.
బంగారం కోసం...
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గెరిగేట్‌పల్లి సమీపంలోకి తీసుకువెళ్లి అక్కడే హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని పారిపోయాడు. అమృతమ్మ కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు 27వ తేదీన గెరిగేట్‌పల్లి సమీపంలోని నాలాలో శవమై కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో భాగంగా... కిష్టప్పను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు తేలిందని వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు తెలిపారు.