MURDER CASE UPDATE: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాసత్యనారాయణపురం రైల్వే కాలనీలోని రైల్వే ఉద్యోగి భార్య సీత (50) హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న పాతకాలం నాటి ల్యాండ్ ఫోన్ కోసమే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఈ కేసులో చాలా మంది ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రైల్వే ఉద్యోగుల పాత్రపైనా కీలక సమాచారం లభించినట్లు సమాచారం.
పాత ల్యాండ్‌ఫోన్లు, టీవీలు ఉంటే లక్షల్లో డబ్బు ఇస్తామని కొన్ని ముఠాలు తిరుగుతున్నాయి. పాతకాలం నాటి ల్యాండ్ ఫోన్ రైల్వే ఎస్‌అండ్‌టీ శాఖకు చెందిన సీత భర్త సత్యనారాయణ వద్ద ఉన్నట్లు అతని స్నేహితులకు తెలిసింది. అప్పటి నుంచి దానిపై కన్నేసిన దుండగులు.. ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని పథకం వేశారు. ఫోన్ దక్కితే లక్షల్లో డబ్బులు వస్తాయని గ్రహించి, సత్యనారాయణ ఇంట్లో లేని సమయంలో పథకం ప్రకారమే అక్కడికి వెళ్లారు. ఫోన్ కోసం మృతురాలితో గొడవపడి, పెనుగులాటలో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఫోన్‌తో పాటు మహిళ మెడలో డబ్బు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
పట్టించిన కాల్ డేటా..:హత్య జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోని సెల్ టవర్లన్నీ జల్లెడపట్టిన పోలీసులు.. కీలక సమాచారాన్ని రాబట్టారు. దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఓ రైల్వే ఉద్యోగి.. తనకు ఏమీ తెలియదన్నట్లు హత్య జరిగినప్పటి నుంచి అక్కడే తచ్చాడుతున్నాడు. డాగ్‌స్క్వాడ్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తుండగా.. జాగిలాలు ఆ ఉద్యోగిని పట్టించాయి.
పోలీసులకు సవాలుగా మారిన కేసు..