Cheddi Gang Arrested:ఏపీలోనివిజయవాడలో నేరాలకు పాల్పడుతున్న చెడ్డీగ్యాంగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని గుల్చర్, మధ్యప్రదేశ్‌లోని జుగువాకు చెందిన ముగ్గురిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.
గత నెల 8 నుంచి ఈ నెల 6 వరకు విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో, తాడేపల్లి ప్రాంతాల్లో చోరీలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయని నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా అన్నారు. సీసీ కెమెరా దృశ్యాలు, నేరాల విధానాలను బట్టి అంతరాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై నిఘా పెంచినట్లు వెల్లడించారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు రెండు బృందాలుగా మొత్తం పదిమంది విజయవాడ పరిసర ప్రాంతాలకు వచ్చి నేరాలకు పాల్పడిన్నట్లు గుర్తించామన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని గుల్చర్ గ్రామానికి చెందిన మడియా కాంజీ మేడా, అదే గ్రామానికి చెందిన సక్ర మండోడ్, మధ్యప్రదేశ్‌లోని జుగువా తాలుకాకు చెందిన కమలేశ్ బాబేరియాలను అరెస్టు చేసిన్నట్లు సీపీ టాటా పేర్కొన్నారు. మరో ఏడుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు.
శివారు ప్రాంతాలే టార్గెట్..!