తెలంగాణ

telangana

ETV Bharat / crime

విజయవాడలో కారు బీభత్సం.. ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లి... - విజయవాడలో కారు బీభత్సం

car havoc in vijayawada: కారు అతివేగానికి ఓ చిన్నారి బలి కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని ఎన్టీఆర్​ జిల్లాలో జరిగింది.

vijayawada-car-accident-near-patharajarajeshwaripet
vijayawada-car-accident-near-patharajarajeshwaripet

By

Published : Aug 6, 2022, 8:59 PM IST

Car havoc in Vijayawada: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న ఓ గోడని ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో షకీల్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జీజీహెచ్​కి తరలించారు. కారు నడిపిన వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details