Fraud in the name of job in Manchyryala district: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పలువురు దగ్గర ఒక వ్యక్తి డబ్బులు తీసుకొన్నాడు. ఉద్యోగం ఎంతకీ ఇప్పించకపోవడం ఆ వ్యక్తిని దేహశుద్ధి చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణిలోని ఎస్ అండ్ పీసీ విభాగంలో సెక్యూరిటీ గార్డ్‌గా కోల మహేశ్ పనిచేస్తున్నాడు. మందమర్రి, జైపూర్, భీమారం, శ్రీరాంపూర్ మండలాలకు చెందిన పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ. 30 లక్షల తీసుకున్నాడు.
ఉద్యోగం పేరుతో రూ.30 లక్షలు టోకరా.. దేహశుద్ధి చేసిన బాధితులు
Fraud in the name of job in Manchyryala district: సింగరేణిలోనీ ఎస్ అండ్ పీసీ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి కోల మహేశ్‌కు బాధితులు దేహశుద్ధి చేయడం చర్చనీయాంశమైంది. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న మహేశ్ మందమర్రి, జైపూర్, భీమారం, శ్రీరాంపూర్ మండలాలకు చెందిన పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ. 30 లక్షల తీసుకున్నాడు.
రోజులు గడిచే కొద్ది వారికి ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. దీంతో గత సంవత్సరం ఆగస్టు 19న మందమర్రి ఎస్ అండ్ పీసీ కార్యాలయంలో సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో బాధితులు మిన్నకుండిపోయారు. నాలుగు నెలలు గడుస్తున్న డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిందితుడు పనిచేసే కార్యాలయానికి వెళ్లి దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడ్ని అదుపులోకి తీసుకొన్నారు.
ఇవీ చదవండి: