ఏపీలోని నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో.. గడువు తీరిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు వినియోగించారంటూ బాధితుల కుటుంబీకులు ఆరోపించారు. ఇంజక్షన్‌పై ఒక తేదీ ఉంటే దానిపై మరో తేదీ ఉన్న స్టిక్కర్‌ను అంటించారని ఆరోపించారు.
Remdesivir Injections: ఆ ముగ్గురి మృతికి.. గడువు తీరిన ఇంజక్షన్లే కారణమా? - ఏపీ వార్తలు
ఏపీలోని విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో.. గడువు తీరిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు వినియోగించారంటూ బాధితులు ఆరోపించడం కలకలం రేపింది. ఈ విషయమై.. వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తే.. ఇంజక్షన్‌ను వినియోగించే పరిస్థితిని బట్టి గడువు పెంచవచ్చుననే మార్గదర్శకాలు ఉన్నాయని వివరించినట్లు బాధితులు తెలిపారు.
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు
ఈ విషయమై వైద్యసిబ్బందిని ప్రశ్నిస్తే.. ఇంజక్షన్‌ను వినియోగించే పరిస్థితినిబట్టి 12 నెలల పాటు వినియోగించే గడువు పెంచవచ్చుననే మార్గదర్శకాలు ఉన్నాయని వివరించినట్లు బాధితులు తెలిపారు. గడువు తీరిన ఇంజక్షన్లు వాడిన రోగుల పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి:Suicide : గర్భిణి ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే..