తెలంగాణ

telangana

ETV Bharat / crime

MBS Jewellers case: ఎంబీఎస్​ జ్యువెలర్స్​ అధినేత​పై.. భూ కబ్జా ఆరోపణలు - mbs jewellers land occupation case

MBS Jewellers case: ఫోర్జరీ డాక్యుమెంట్స్​ సృష్టించి రూ. కోట్ల విలువైన తన భూమిని కబ్జా చేశారంటూ ఎంబీఎస్​ జ్యువెలర్స్​ అధినేతపై​ ఓ వ్యక్తి ఆరోపణలు చేశారు. జీహెచ్​ఎంసీ అధికారులతో కుమ్మక్కై ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని మీడియా ఎదుట పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలూ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

MBS Jewellers case
ఎంబీఎస్​ జ్యువెలర్స్​ కేసు

By

Published : Jan 13, 2022, 4:46 PM IST

MBS Jewellers case: ఎంబీఎస్ జ్యువెలర్స్​ అధినేత​ సుఖేశ్​ గుప్తా ఫోర్జరీ డాకుమెంట్స్​ సృష్టించి భారీ మోసం చేశారని... బాధితుడు వీరేంద్ర తివారి ఆరోపించారు. ఫోర్జరీ డాకుమెంట్స్​తో రూ. కోట్ల విలువైన భూమిని కాజేశారని పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ బేగంపేట సర్వే నంబర్ 199/2 లోని 4,200 గజాల తమ భూమిని... ఎంబీఎస్ జ్యువెల్లర్స్, గేహన ప్రాజెక్ట్స్ అధినేత సుఖేశ్ గుప్తా, వాసవి నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్​తో కలిసి కాజేశారని బాధితుడు వీరేంద్ర ఆరోపించారు.

గతంలో ఫిర్యాదు చేసినా

తన స్థలంపై ఫోర్జరీ రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ సృష్టించి కబ్జా చేశారని బాధితుడు పేర్కొన్నారు. వీటి ద్వారా జీహెచ్ఎంసీ అధికారులతో కుమ్మకై.. 10 అంతస్తుల అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు. నకిలీ టీఎస్​ఎల్​ఆర్​ డాకుమెంట్స్​తో జీహెచ్ఎంసీ అధికారులను తప్పుదోవ పట్టించి అనుమతి తీసుకున్నారని... వాటిని అధికారులు వెరిఫికేషన్ చేయకుండా అనుమతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై సుఖేశ్​ గుప్తా, వాసవి నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎర్రం విజయ్ కుమార్​లపై గతంలో నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. అయినప్పటికీ అధికారులు, పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీ.. నిందితులపై చర్యలు తీసుకొని నాయ్యం చేయాలని బాధితుడు వీరేంద్ర తివారీ కోరారు.

ఇదీ చదవండి:Cyber Crime: నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్.. రూ.కోటి 11 లక్షలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details