మాంసం విషయంలో గొడవ.. చికెన్ సెంటర్ నిర్వాహకులపై యాసిడ్ దాడి - వేములవాడలో యాసిడ్ దాడి
08:02 April 01
Acid Attack in Vemulawada : వేములవాడ తిప్పపూర్‌లో యాసిడ్ దాడి
Acid Attack in Vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ గ్రామంలో చికెన్ గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. హరీశ్ అనే వ్యక్తి చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తుండగా... పట్టణంలోని సప్తగిరి కాలనీకి చెందిన చిరువ్యాపారులు చికెన్ కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకున్న తర్వాత.... చికెన్ వాసన వస్తోందంటూ.... షాప్ వద్దకు వచ్చి గొడవ చేశారు.
Chicken fight in Vemulawada : ఈ క్రమంలోనే ఇరువురి మధ్య గొడవ పెద్దదైంది. ఆగ్రహానికి గురైన చిరువ్యాపారులు.... చికెన్ షాప్ నిర్వాహకుడి సహా, అక్కడున్న మరికొందరిపై యాసిడ్‌తో దాడిచేశారు. ఈ ఘటనలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు.
- ఇదీ చదవండి :ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు.. ఇద్దరు మృతి