ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మద్దూరుపాడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి మృత్యువాతపడగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వేములవాడ పట్టణం అంజనీనగర్‌కు చెందిన లాల దేవయ్య కుటుంబీకులు తిరుమలలో దర్శనం చేసుకుని తిరిగి వేములవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు... వేములవాడ వాసి మృతి - accident news
ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా మద్దూరుపాడు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... నలుగురికి గాయాలయ్యాయి.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు... వేములవాడ వాసి మృతి
లాల దేవయ్య (58) అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: టైర్ల లోడుతో వెళ్తున్న టాటా ఏసీ బోల్తా.. ఒకరి మృతి