తెలంగాణ

telangana

ETV Bharat / crime

సినిమాకు ఏమాత్రం తగ్గని తండ్రికూతురి కథ.. పోలీసుల ఎంట్రీతో అదిరిపోయే క్లైమాక్స్​..! - vemulawada love story

ఎంతో వైభవంగా పెళ్లి చేస్తే.. రెండేళ్లు కూడా గడవకముందే ఏలుకోలేనని అల్లుడు తెగేసి చెప్పాడు. మెట్టినింట్లో ఆనందంగా ఉండాల్సిన కుమార్తె.. పుట్టింటికే పరిమితమైంది. ఇరుగుపొరుగు, బంధువులు, స్నేహితులు అడిగే ప్రశ్నలు.. గునపాల్లా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి.. కూతురి జీవితాన్ని చక్కదిద్దాలని ఆ తండ్రి పథకం పన్నాడు. కానీ.. సమయానికి కథ అడ్డం తిరిగి అసలుకే ఎసరొచ్చింది. ఇంతకీ ఆ తండ్రి ప్లాన్​ ఏంటీ..? తన కుమార్తె సంసారం ఇలా ఎందుకైంది..?

Vemulawada Police Offended murder plan and arrested four accused
Vemulawada Police Offended murder plan and arrested four accused

By

Published : May 5, 2022, 7:29 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్​ పరిధిలోని తిప్పాపూర్​కు చెందిన నీలం శ్రీనివాస్(45).. రియల్​ఎస్టేట్ వ్యాపారం​ చేస్తుంటాడు. ఆయన కూతురు శిరీష.. వేములవాడలోని సుభాష్​నగర్​కు చెందిన మనోజ్​కుమార్.. చదువుకునే రోజుల్లోనే​ ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇంట్లో తెలిసింది. సమాజంలో పరపతి ఉన్న శ్రీనివాస్​.. ఈ ప్రేమ వ్యవహారం బయటికి తెలిస్తే తన పరువుపోతుందని భావించాడు. సినిమాల్లో చూపించినట్టు.. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే అంతా అదే సర్దుకుంటుందన్న గట్టి నమ్మకానికి శ్రీనివాస్ వచ్చాడు. ఒక మంచి సంబంధం చూసి కూతురికి వైభవంగా పెళ్లి చేశాడు. ఇంకేముంది.. అత్తారింటికి వెళ్లిన కుమార్తె భర్త, సంసారం అంటూ అన్ని మర్చిపోయి.. ఆనందంగా ఉంటుందని ఊహించాడు.

అంతా బాగానే సాగుతోన్న కుమార్తె సంసారం చూసి తండ్రి ఆనందపడ్డాడు. తాను చేసింది సరైందేనని సమర్థించుకున్నాడు. అందరూ అదే భావనలో ఉంటే.. శిరీష మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా తన ప్రియుడు మనోజ్​తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. కొన్ని నెలలకు ఇంటి నుంచి పారిపోయి మనోజ్​ను కలుసుకుని.. అందరినీ తేరుకోలేని షాక్​కు గురిచేసింది. మనోజ్, శిరీష​ కలిసి ముంబయి వెళ్లి.. వారం రోజులు ఉన్నారు. తిరిగి వేములవాడకు వచ్చారు. ఇంత జరిగాక.. శిరీషను తన భర్త అంగీకరించలేదు. ఏలుకోలేనని తెగేసి చెప్పేశాడు. ఇక చేసేదేమీ లేక.. శిరీషను తల్లిదండ్రులు తిప్పాపూర్​కు తీసుకొచ్చారు. అయినా.. శిరీష తన ప్రియున్ని వదిలిపెట్టలేదు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగినా.. తీరు మార్చుకోలేదు.

అటు ఇంట్లో కూతురి ప్రవర్తనతో.. ఇటు బయట ఎదురవుతోన్న అవమానంతో.. తీవ్ర సంఘర్షణకు లోనయ్యాడు. దీనంతటికీ కారణం ఆ మనోజేనని.. అతడిని చంపేస్తే సమస్యే సమసిపోతుందని తండ్రి శ్రీనివాస్​, అతడి స్నేహితుడు మనుక కుంటయ్య కలిసి అంచనాకు వచ్చారు. వెంటనే మనోజ్ కుమార్ ఫోటోను వాట్సప్ ద్వారా కుంటయ్యకు శ్రీనివాస్​ పంపించాడు. ఇదే విషయమై.. వారం రోజుల క్రితం వేములవాడలో కుంటయ్యను శ్రీనివాస్​ కలిశాడు. మనోజ్​ను పెద్ద కత్తులతో దాడి చేసి చంపేందుకు పథకం వేశారు. ఇందుకోసం బిహార్​కు చెందిన లిఖింద్ర సైని, కోరుట్లకు చెందిన బొమ్మిడి రాజ్​కుమార్​తో కలిసి రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.

మనోజ్​కుమార్​ను గురువారం(మే 5) హత్య చేసేందుకు నిశ్చయించుకున్నారు. కాగా.. ఈరోజు ఉదయం నుంచి​ మనోజ్​కుమార్ కదలికలను లిఖింద్ర, రాజ్​కుమార్​ గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు తిప్పాపూర్ బస్టాండ్​లో కలుసుకున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే.. మరో పరువు హత్య జరిగేదేమో..? కానీ.. అప్పటికే హత్య గురించి సమాచారం అందటంతో.. పోలీసులు వారి పనిలో వారున్నారు. అదే సమయంలో కారులో కత్తులతో సిద్ధంగా ఉన్న లిఖింద్ర, రాజ్​కుమార్​.. పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారి కదలికలను గమనిచిన పోలీసులు.. నిందితులను వెంటనే పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా.. రెండు పెద్ద కత్తులు, బాధితుని ఫొటో కనిపించటంతో అదుపులోకి తీసుకున్నారు. వారి స్టైల్లో విచారించగా.. అసలు విషయాన్ని బయటపెట్టేశారు. ఇంకేముంది.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. రిమాండుకు తరలించారు. నిందితుల నుంచి నాలుగు సెల్​ఫోన్లు, ఓ కారు, ఓ ద్విచక్రవాహనం, 5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సినిమాకు ఏమాత్రం తగ్గని తండ్రికూతురి కథ.. పోలీసుల ఎంట్రీతో అదిరిపోయే క్లైమాక్స్​..!

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details