తెలంగాణ

telangana

ETV Bharat / crime

వాహనం పల్టీ.. ఇద్దరు మృతి, మరో ఏడుగురికి గాయాలు - దిలావర్ పూర్​లో వాహనం బోల్తా

టవేరా వాహనంలో విందుకు బయలుదేరిన ఓ కుటుంబానికి ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆ వాహనం పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిర్మల్​ జిల్లా దిలావర్ పూర్ సమీపంలో జరిగింది.

Vehicle overturns Two children died seven people injured at nirmal district
వాహనం పల్టీ.. ఇద్దరు మృతి, మరో ఏడుగురికి గాయాలు

By

Published : Mar 8, 2021, 1:45 AM IST

వాహనం పల్టీ.. ఇద్దరు మృతి, మరో ఏడుగురికి గాయాలు

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ గ్రామ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై టవేరా వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్​కు చెందిన ఓ కుటుంబం బైంసాలో జరిగే విందుకు టవేరా వాహనంలో బయలుదేరారు. దిలావర్ పూర్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి టవేరా వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. వాహనంలో తొమ్మిది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో నాలుగేళ్ల పాపకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. ఏడాది బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయాలపాలైన క్షతగాత్రులను నిర్మల్ జిల్లా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

ఇదీ చూడండి:లారీని ఢీకొట్టిన కారు... ఓ వ్యక్తి మృతి, ఆరుగురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details