నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద ప్రమాదవశాత్తు ఓ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు.
Accident: వాహనం బోల్తా.. వ్యక్తి మృతి - నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద ఓ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు.

accident
దోమలపెంటకు చెందిన శివలింగం(35).. విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్టు ఎలక్ట్రీషన్గా విధులు నిర్వహించేవాడు. ఇవాళ సాయంత్రం వాహనంలో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు అతడి భార్యకు జలవిద్యుత్ కేంద్రంలో ఉద్యోగం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి:Mahabubnagar: బండారుపల్లి వాగులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం