వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చర్లపల్లిలో.. బైక్ అదుపు తప్పటంతో కాలువలోకి దూసుకెళ్లి గల్లంతైన తండ్రీ కొడుకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. గొర్రెల కాపారి ఇచ్చిన సమాచారం మేరకు.. నిన్న రాత్రి గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవటంతో మంగళవారం యువకుల సాయంతో పోలీసులు గాలింపు చేశారు. ప్రమాద స్థలం నుంచి కిలో మీటరు దూరంలో రాములు మృత దేహం.. పెబ్బేరు మండలం చెలిమిల్ల వద్ద జశ్వంత్ మృతదేహం లభ్యమయ్యాయి.
విషాదం: గల్లంతైన తండ్రీ కొడుకులు శవమై దొరికారు - Vanaparthi district, the bodies of a father and son were founded
వనపర్తి జిల్లాలో.. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తూ.. ప్రమాదశావత్తు బైక్ కాల్వలో పడిన ఘటనలో గల్లంతైన తండ్రీకొడుకుల మృతదేహలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గల్లంతైన తండ్రి కొడుకులు శవమై దొరికారు
భర్తతోపాటు.. ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడడంతో భార్య సరోజ కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. తండ్రీకొడుకుల గల్లంతు