గత నెల 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద జరిగిన వామన్ రావు దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ముగ్గురు నిందితులను మంథనికి తీసుకెళ్లిన పోలీసులు.. హత్యకు ముందు రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ - తెలంగాణ వార్తలు
హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. హత్యకు ముందు రెక్కీ నిర్వహించిన ప్రాంతాలకు నిందితులను తీసుకెళ్లిన పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అనంతరం నిందితులను హత్యాస్థలికి తరలించారు.
రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్
మంథని కోర్టు ప్రాంగణంతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయం, అంబేడ్కర్ చౌక్‌లో రెక్కీ చేసినట్లు నిందితులు ఒప్పకున్నారు. అడ్మిన్ సీపీ అశోక్‌తో పాటు గోదావరిఖని ఏసీపీ ఉమేందర్.. ముగ్గురు నిందితులను హత్య జరిగిన కల్వచర్లకు తీసుకెళ్లారు. హత్యకు సంబంధించిన విషయాలను నిందితులు కుంట శ్రీను, కుమార్, చిరంజీవి పోలీసులకు వివరించారు.
Last Updated : Mar 3, 2021, 3:02 PM IST