Uttarakhand police accused arrest in hyderabad: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో జరిగిన ఓ హత్యకేసులో నిందితున్ని మంగళవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. 2019లో ఓ గ్రామ పెద్దను హత్య చేసిన కేసులో నిందితులు హైదరాబాద్ అత్తాపూర్ పీఎస్ పరిధిలోని సులేమాన్ నగర్లో ఉన్న బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. రాజేంద్రనగర్ పోలీసుల సహకారంతో దాడి చేశారు. అయితే పోలీసులపైనే నిందితులు దాడికి దిగారు. కళ్లలో కారంకొట్టి తప్పించుకునేందుకు యత్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసిమ్ తప్పించుకోగా.. అతని భార్య షామా పర్వీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు తప్పించుకునేందుకు వారి బంధువులు కూడా సహకరించడం కొసమెరుపు.
దాడికి పాల్పడిన వారిపై కేసు
Attack on police: ఈ దాడిలో ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్‌ఫోర్స్ కానిస్టేబుల్ చమాన్ కుమార్, రాజేంద్ర నగర్ పీఎస్ కానిస్టేబుల్ ఫయాజ్ కళ్లలో కారం కొట్టారు. పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై రాజేంద్రనగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.