Bride Death Case: ఏపీ విశాఖ మధురవాడకు చెందిన వధువు సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. పెళ్లి అపాలనుకునే ప్రయత్నంలో వధువు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు నిర్ధారించారు.
Bride Death Case: పెళ్లి ఆపాలనుకుంది... కానీ ప్రాణమే పోయింది... - Bride Death Case update
Bride Death Case : ఏపీ వైజాగ్‌లో పెళ్లిపీటలపై కుప్పకూలి చనిపోయిన వధువు కేసులో మిస్టరీ వీడింది. ప్రేమ వ్యవహారం కారణంగా పెళ్లిని ఆపే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
కాల్ డయల్ రికార్డర్‌తో నిజాలు వెలుగు చూసినట్లు తెలిపారు. పెళ్లికి 3 రోజుల ముందు ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో ఛాటింగ్ చేసినట్లు గుర్తించారు. పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే వ్యక్తితో ఏడేళ్లుగా ప్రేమలో ఉంది. సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి నిరాకరిస్తూ వచ్చిన మోహన్.. కొంత సమయం నిరీక్షించాలని సృజనకు చెప్పాడు.
ఈ క్రమంలో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి సృజన హామీ ఇచ్చింది. అయితే.. ఊహించని విధంగా మృతి చెందింది. విష పదార్థం తీసుకోవడంతో పెళ్లి రోజు సృజనకు ఆరోగ్యం క్షీణించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.