మాటురులో అసాంఘిక కార్యకలాపాలు - Yadadri crime news
రాచకొండ కమిషనర్ పరిధిలో పోలీసులు వరుస దాడులు జరుపుతున్నా... అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. విశ్వసనీయ సమాచారం మేరకు .యాదాద్రి జిల్లాలో ఎస్ఓటీ పోలీసులు పక్కగా దాడులు జరిపి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.
police
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలోని ఓ వ్యవసాయ మామిడితోటలో ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ మహిళతో పాటు నలుగురు వ్యక్తులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను మోటకొండూరు పోలీసు స్టేషన్లో అప్పగించారు. వారి నుంచి రూ.6,030 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 6 చరవాణీలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.