The boy was kidnaped in GGH: ఏపీలోని గుంటూరు జీజీహెచ్‌లో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురి కావటం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలేనికి చెందిన కిజియా అనే మహిళ కాన్పు కోసం నాలుగు రోజుల క్రితం గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చేరింది. కిజియాతో పాటు ఆమె ఐదేళ్ల కుమారుడు వర్షిద్ హస్పిటల్‌కు వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి వరండాలో నిద్రించాడు.
Boy kidnaped in ggh: కాన్పు కోసం ఆసుపత్రికి వెళితే.. ఉన్న బిడ్డ మాయం.. - crime news
The boy was kidnaped in Guntur GGH: ఐదేళ్ల బాలుడు ఏపీలోని గుంటూరు జీజీహెచ్‌లో అపహరణకు గురయ్యాడు. కాన్పు కోసం వచ్చిన తల్లి వెంట వచ్చిన ఆ బాలుడు రాత్రి సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలుడు అపహరణ
కాసేపటికి వర్షిద్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ మహిళ వర్షిద్ను తీసుకెళ్లినట్లుగా రికార్డు అయ్యింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా జీజీహెచ్‌లో పిల్లల అపహరణకు సంబంధించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తరచుగా పిల్లల కిడ్నాప్‌లు జరుగుతున్నా ఆసుపత్రిలో నిఘా కొరవడటం ఆందోళన కలిగిస్తోంది.
గుంటూరు జీజీహెచ్‌లో బాలుడు అపహరణ
ఇవీ చదవండి: