కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన... హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ శ్మశానవాటికలో చోటుచేసుకుంది. మూసి ఒడ్డున ఉన్న శ్మశానవాటిక నుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు.
శ్మశానవాటికలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ శ్మశానవాటికలో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన మహిళ వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Vaccine: పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇస్తే.. బిడ్డకూ రక్ష
Last Updated : Jun 18, 2021, 12:24 PM IST