కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ ఉడిపి హోటల్ యజమాని వాసంతి శెట్టిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వచ్చిన అగంతకులు కత్తితో దాడి చేశారు. ఆమె గట్టిగా అరవడంతో దుండగులు పారిపోయారు. బయటకు వెళ్లిన కోడలు ఇంటికి వచ్చి చూడగా.. వాసంతి గాయాలతో కనిపించింది. వెంటనే ఆమెను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. పని నిమిత్తం ఆమె కుమారుడు సందీప్ 15 రోజుల క్రితం బెంగళూర్ వెళ్లాడు. నాలుగు రోజుల క్రితమే పని ముగించుకొని హైదరాబాద్‌కు వచ్చాడు.
Murder attempt: ప్రముఖ వ్యాపారవేత్త వాసంతి శెట్టిపై హత్యాయత్నం - కరీంనగర్ వ్యాపారవేత్త వాసంతి శెట్టిపై ఆగంతకుల హత్యాయత్నం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ వ్యాపారవేత్త వాసంతి శెట్టిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి కత్తితో పొడిచి పారిపోయారు.
ప్రముఖ వ్యాపారవేత్త వాసంతి శెట్టిపై హత్యాయత్నం
తల్లిపై హత్యాయత్నం జరిగినట్లు తెలుసుకున్న సందీప్ కరీంనగర్‌కు చేరుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పని మనుషులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని అడిషనల్ డీసీపీ అశోక్ కుమార్, ప్రొబేషనరీ ఐపీఎస్ రీతు రాజ్ పర్యవేక్షిస్తున్నారు. ఘటన జరిగినపుడు కోడలు, పని మనుషులు ఎక్కడికి వెళ్లారు వంటి విషయాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
ఇదీ చదవండి:Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!