సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ధర్మారం గ్రామ శివారులో ఉన్న బోరబండ ప్రాజెక్టు చెరువులో బ్రిడ్జి పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎవరో హత్య చేసి శవాన్ని నీటిలో పడేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ధర్మారంలో గుర్తుతెలియని వ్యక్తి హత్య - ధర్మారంలో గుర్తుతెలియని వ్యక్తి హత్య
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ధర్మారం గ్రామ శివారులోని బోరబండ ప్రాజెక్టు చెరువు వద్ద జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
![ధర్మారంలో గుర్తుతెలియని వ్యక్తి హత్య ధర్మారంలో గుర్తుతెలియని వ్యక్తి హత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:28:48:1623200328-tg-srd-16-08-gurthu-teliyani-vyakthi-daruna-av-ts10054-08062021221843-0806f-1623170923-154.jpg)
ధర్మారంలో గుర్తుతెలియని వ్యక్తి హత్య
మృతుడి ఎత్తు 5' 5, వయసు 30 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉంటుందని గజ్వేల్ రూరల్ సీఐ, కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహంపై తెలుపు బ్లూ రంగు డబ్బల షర్టు, షాట్ ఉందన్నారు. తెలిసిన వారు పోలీస్ స్టేషన్ సంప్రదించాలని కోరారు. లేదా జగదేవ్పూర్ ఎస్ఐ 9490617070 నెంబర్కు ఫోన్ చేయాలన్నారు.
ఇదీ చదవండి: LOCKDOWN: రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగింపు