తెలంగాణ

telangana

ETV Bharat / crime

రైల్వే ప్లాట్‌ ఫాంపై గుర్తు తెలియని మృతదేహం - సికింద్రాబాద్ క్రైం వార్తలు

రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై విశ్రాంతి తీసుకుంటున్న గుర్తు తెలియని వృద్ధుడు మరణించాడు. గమనించిన సిబ్బంది రైల్వే పోలీసులకు తెలిపారు. ఈ ఘటన సికింద్రాబాద్​లో చోటుచేసుకుంది.

Unknown dead body on railway platform, secunderabad crime news
రైల్వే ప్లాట్‌ ఫాంపై గుర్తు తెలియని మృతదేహం

By

Published : Apr 27, 2021, 7:58 PM IST

సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ ఫాంపై గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. స్టేషన్​లోని పదో నంబరు ప్లాట్ ఫాంపై వృద్ధుడు(65)మృతి చెందినట్లు అక్కడి సిబ్బంది గుర్తించారు.

ఈ మేరకు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అతనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడం వల్ల ఉస్మానియా మార్చురీకి తరలించారు. అతడు అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి :కొవిడ్​ బాధితుడు ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details