తెలంగాణ

telangana

ETV Bharat / crime

'మహిళలపై దాడుల్లో యూపీ, బిహార్‌ను మించిపోయిన ఏపీ' - Latest news on AP crime

Central on AP women attacks : రోజు రోజుకి మహిళలపై అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయి. అయితే ఎక్కువగా యూపీ, బిహార్​లోనే జరుగుతాయనుకొంటే పొరపాటు పడినట్టే. తాజాగా కేంద్ర హెూంశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్​లో కేసులు పెరుగుతున్నాయని పార్లమెంట్​కి చెప్పింది.

Delhi Central on AP women attacks breaking
మహిళలపై అత్యాచార కేసులో యూపీ,బిహార్​ని మించిపోతున్న ఏపీ

By

Published : Dec 20, 2022, 9:33 PM IST

Central on AP women attacks : మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్‌.. యూపీ, బిహార్‌ని మించిపోతోందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నట్లు కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు చెప్పింది. గత నాలుగైదేళ్లలో దాడుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న కేంద్ర హోం శాఖ.. లైంగిక వేధింపుల్లో అగ్రభాగాన నిలిచినట్లు స్పష్టం చేసింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

2018తో పోల్చితే.. 2021 నాటికి మహిళలపై అత్యాచారాలు 22 శాతం, దాడులు 15 శాతం, లైంగిక వేధింపులు 31 శాతం పెరిగాయని కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది. 2018 నుంచి 2021 మధ్య కాలంలో మహిళలపై 4,340 అత్యాచారాలు, 8406 ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఉదంతాలు.. 18,883 సాధారణ దాడులు జరిగాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సందర్భంలో దాడులు 2018లో 4,445 ఉంటే... 2021లో 5,108 జరిగాయి.

  • ఆంధ్రప్రదేశ్​లో 2018 నుంచి 2021 వరకు క్రమంగా పెరిగిన అత్యాచార ఘటనలు, లైంగిక వేధింపుల కేసుల వివరాలు
అంశం 2018 2019 2020 2021
అత్యాచార ఘటనలు 971 1086 1095 1188
లైంగిక వేధింపులు 1802 1892 2342 2370
  • మహిళలపై ఆంధ్రప్రదేశ్​లో 2018తో పోలిస్తే 2021లో పెరిగిన దాడులు వివరాలు.
అంశం 2018లో 2021లో
దాడులు 4445 5108
  • ఆంధ్రప్రదేశ్​లో 2018తో పోలిస్తే 2021 పెరిగిన కేసుల వివరాలు
అంశం పెరిగిన శాతం మధ్య కాలంలో జరిగినవి
అత్యాచారాలు 22 4340
దాడులు 15 18883
లైంగిక/ఆత్మగౌరవానికి భంగం కలిగించేవి 31 8406

హత్యలు కూడా పెరుగుతున్నట్లు హోం శాఖ పేర్కొంది. ఈ కాలంలో యాసిడ్‌ దాడులు మాత్రం తగ్గినట్లు లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details