రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. రెండో ఫ్లాట్‌ఫామ్ వద్ద షిరిడి సాయినగర్ ఎక్స్‌ప్రెస్ వెళ్తున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య.. పోలీసులు ఆరా - రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. మృతునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో యువకుడు ఆత్మహత్య
యువకుడు చనిపోవడానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.