తెలంగాణ

telangana

ETV Bharat / crime

బిచ్చగత్తె సొమ్ముకాజేయాలని హత్య... నిందితుల అరెస్ట్ - కేసును ఛేదించిన పోలీసులు

నిజామాబాద్​లో జరిగిన మహిళ హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాకేంద్రంలోని మాలపల్లిలోని మత్స్యశాఖ కార్యాలయం సమీపంలో ఈనెల 11న అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును ఛేదించారు.

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Jun 17, 2021, 9:26 PM IST

అనుమానాస్పదస్థితిలో గుర్తించిన ఓ మహిళ హత్య కేసును నిజామాబాద్ ఒకటో పట్టణ పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని మాలపల్లిలోని మత్స్యశాఖ కార్యాలయం సమీపంలో ఈనెల 11న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని పోలీసు కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు.

అయితే మృతురాలు రత్నమ్మ భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీసేదని ఏసీపీ తెలిపారు. ఆమె దగ్గర డబ్బులు కాజేయాలనే దురుద్దేశంతో పాండురంగ అనే వ్యక్తి మహిళ తలపై కర్రతో బాది, టవల్​తో గొంతునులిమి హత్య చేశాడని ఏసీపీ వెల్లడించారు. బోధన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతన్ని పోలీసులు అరెస్ట్​ చేసినట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుంచి మహిళ హత్యకు ఉపయోగించిన కర్రతో పాటు రూ.1200 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలోనూ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. కేసును ఛేదించిన వన్ టౌన్ సీఐ ఆంజనేయులు బృందాన్ని అభినందించిన ఏసీపీ వెంకటేశ్వర్లు రివార్డును అందజేశారు.

ఇదీ చూడండి:BLACK FUNGUS: 7వేల రూపాయల ఇంజెక్షన్ 50వేలకు అమ్మారు..

ABOUT THE AUTHOR

...view details