నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. 63వ జాతీయ రహదారి పక్కన ఉన్న కుందేలు గుట్టపై ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.
గుర్తుతెలియని మహిళ దారుణహత్య.. కేసు నమోదు - telangana crime news
గుర్తుతెలియని ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మోర్తాడ్‌లో మహిళ హత్య
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాజు పెంకుతో మహిళ గొంతుకోసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.