మహబూబ్‌నగర్ జిల్లాలో గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని రైల్వే స్టేషన్కు సమీపంలో బోయపల్లి గేటు వద్ద మహిళ(40) ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య - మహబూబ్‌నగర్ జిల్లా తాజా వార్తలు
రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య
మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర వైపు గూడ్స్ రైలు వెళ్తుండగా... ఆ సమయంలో పట్టాలపైకి ఆకస్మాత్తుగా మహిళ వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు లోకో పైలెట్ నిర్ధారించినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో బాధితులకు ప్రలోభాలు'