ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. నగర శివారులోని రామన్నపేట వద్ద రైల్వే ట్రాక్ పక్కన గోనె సంచిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.
రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం - ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి
ఖమ్మం నగరంలో రైల్వే ట్రాక్ పక్కన ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం
సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక అన్నం సేవా సంస్థ సభ్యులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:వల తీస్తుండగా చెక్ డ్యాంలో పడి మృతి