fire to the hut : మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి చిన్న సిద్ధయ్య తన భార్య సాయవ్వ, మనుమడు, మనుమరాలుతో ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుడిసె దగ్గరకు వచ్చి తలుపుకు గడియపెట్టి నిప్పు పెట్టారు.
గుడిసె నుంచి పొగలు రావడంతో లోపల నిద్రిస్తున్న వారికి మేలకువ వచ్చి బయటకి వచ్చేందుకు ప్రయత్నించారు. బయట తలుపుకు గడియ ఉండడంతో పెద్దగా కేకలు వేశారు. పక్కింటి వారు వచ్చి తలుపు తీయడంతో సిద్ధయ్య కుటుంబం ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.