సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం తెల్లబండ తండా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు గడ్డివాములకు నిప్పటించారు. దీనితో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 70వేల రూపాయల ఆస్తినష్టం వాటిల్లందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
గడ్డివాములకు నిప్పటించిన గుర్తుతెలియని వ్యక్తులు - Telangana News Updates
ఓ రైతు ఆరుగాలం కష్టపడి ఇంటికి తెచ్చిన గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాటికి నిప్పటించారు. దీనితో రైతు ఆవేదన చెందుతున్నాడు.
Grasshopper
ఆరుగాలం కష్టపడి ఇంటికి తెచ్చిన పశుగ్రాసం గుర్తు తెలియని వారు దగ్ధం చేశారని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడం వల్ల గడ్డివాములు చాలావరకు దగ్ధమయ్యాయి.
ఇదీ చదవండి:కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు