తెలంగాణ

telangana

ETV Bharat / crime

Deers skeletons: కలకలం సృష్టిస్తున్న జింకల కళేబరాలు... ఎక్కడంటే - కర్నూలులో జింక కళేబరాలు

Deers skeletons in kurnool: ఏపీలోని కర్నూలు జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు 10 జింకలను కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తమయ్యారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Deers skeleton
జింక కళేబరాలు

By

Published : Mar 6, 2022, 5:30 PM IST

Deers skeletons in kurnool: ఏపీలోని కర్నూలు జిల్లాలో జింకల కళేబరాలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు 10 జింకలను కాల్చి చంపారు. ఆదోని మండలం నారాయణపురం వద్ద ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆదోని సరిహద్దు చెక్​పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితులు కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి :Grand father-son dead: నీటిలో మునిగిన మనువడు.. రక్షించబోయి తాత

ABOUT THE AUTHOR

...view details