తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganesh nagar Murder Case : దారుణం.. నోట్లో గుడ్డలు కుక్కి.. రాడ్లతో కొట్టి చంపారు! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Ganesh nagar Murder Case: మేడ్చల్ జిల్లా చింతల్​లోని గణేశ్ నగర్​లో అర్ధరాత్రి వేళ మెకానిక్​ను అతి దారుణంగా హతమార్చారు. మెకానిక్ బీరెందర్ నోట్లో గుడ్డలు కుక్కి.. గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లతో కొట్టి చంపారు. మృతుని దుకాణంలోని ఈ ఘటన జరిగింది.

Ganesh nagar Murder Case, mechanic murder case
అర్ధరాత్రి రాడ్లతో కొట్టి హత్య

By

Published : Jan 21, 2022, 10:46 AM IST

Updated : Jan 21, 2022, 2:32 PM IST

Ganesh nagar Murder Case : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చింతల్ గణేశ్ నగర్​లో అర్ధరాత్రి దారుణం జరిగింది. బైక్ మెకానిక్​ను తన షాప్​లోనే గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా హత్య చేశారు.

ఏం జరిగింది?

చింతల్​లోని కల్పన సొసైటీలో నివాసముండే బీరేందర్ కుమార్​కు గణేష్ నగర్​లో ఓ మెకానిక్ షాప్ ఉంది. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో బీరేందర్ కుమార్​ను తన దుకాణంలోనే... నోట్లో బట్టలు కుక్కి రాడ్లతో తలపై బలంగా కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అనేక కోణాల్లో దర్యాప్తు

మృతుడు బీరేందర్ కుమార్ దుకాణంలో అందరూ కలిసి మద్యం సేవించారా? అక్కడ ఏమైనా ఘర్షణ చెలరేగిందా? లేక మరేవైనా కారణాలున్నాయా అనే కోణంలో జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Hospital Charges For Covid Treatment : కాక్‌టెయిల్‌ పేరు చెప్పి ఆస్పత్రుల దోపిడీ

Last Updated : Jan 21, 2022, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details