నవవధువు మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఆసుపత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయిన ఘటన మేడ్చల్ జిల్లా సురారం మల్లారెడ్డి హాస్పిటల్లో జరిగింది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో ఓ నవ వధువును తీసుకుని వచ్చారు. ఆ మహిళ సమాచారం ఇవ్వకుండానే ఆసుపత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయారు.
Dead Body: ఆస్పత్రిలో నవవధువు మృతదేహం.. ఆమె ఎవరు? అక్కడెందుకు వదిలేశారు? - నవవధువు మృతదేహాన్ని ఆస్పత్రిలో వదిలివెళ్లిన ఇద్దరు వ్యక్తులు
నెంబర్ లేని ఆటోలో వచ్చారు. ఓ మహిళా దేహాన్ని ఆసుపత్రి సిబ్బందికి అప్పజేప్పారు. చూసుకొండి అని మాయమైపోయారు. పరీక్షించిన వైద్యులు.. ఆ మహిళ అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఆమెను తీసుకెళ్లేందుకు బంధువులు వస్తారని చూడగా.. ఎవరూ రాకపోయేసరికి పోలీసులకు సమాచారం అందించారు.
వైద్యులు గమనించి పరీక్షించారు. సదరు మహిళ అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు. కాసేపటి వరకు వేచి చూసిన ఆస్పత్రి సిబ్బంది... మహిళకు సంబంధించిన వారిని వేతికారు. ఎంతసేపటికీ ఎవరు రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు మృతురాలిని వదిలి వెళ్ళిన వారి గురించి ఆరా తీస్తున్నారు.
నెంబర్ ప్లేట్లేని ఆటోలో మృతదేహాన్ని తీసుకుని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. సదరు మహిళ.. నవ వధువుగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతురాలి ఎడమ చేతికి లక్ష్మీ అనే పేరు ఉన్నట్లు పోలీసులు గమనించారు. ఆ మహిళ ఎవరు..? ఎలా చనిపోయింది..? హత్యనా.. ఆత్మహత్యనా..? తీసుకొచ్చి వదిలేసిన వాళ్లు ఎవరు..? ఎందుకు వెళ్లిపోయారు..? మృతదేహాన్ని ఆస్పత్రికి ఎందుకు తీసుకొచ్చారు...? అనే అంశాలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.