వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ఎస్సారెస్పీ కాలువలో ఓ గుర్తు తెలియని మృత దేహం కొట్టుకువచ్చింది. మండలంలోని ల్యాదళ్ల గ్రామ శివారులోని ఎస్సారెస్పీలో గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని కాలువ నుంచి బయటకు తీశారు.
ఎస్సారెస్పీ కాలువలో... గుర్తు తెలియని మృతదేహం - telangana latest news
వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ఎస్సారెస్పీ కాలువలో ఓ గుర్తు తెలియని మృత దేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎస్సారెస్పీ కాలువలో... గుర్తు తెలియని మృతదేహం
మృతదేహం కుళ్లిపోయి ఉందని.. పది రోజుల క్రితం కాలువలో పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించి, అనంతరం మార్చురీలో భద్రపరిచినట్లు దామెర ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:'నీ బౌలింగ్ బాగుంది.. వివాదాల జోలికి వెళ్లకు'