తెలంగాణ

telangana

ETV Bharat / crime

హుస్సేన్​సాగర్​లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్ హుస్సేన్​సాగర్​లో ట్యాంక్​బండ్​ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎవరైనా తోసి వేశారా... లేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

unidentified man dead body was found in Hussain Sagar hyderabad
హుస్సేన్​సాగర్​లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

By

Published : Apr 28, 2021, 3:19 PM IST

హుస్సేన్​సాగర్​లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ట్యాంక్​ బండ్​ వద్ద మారియట్ హోటల్ సమీపంలో శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తాడు సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.

అనంతరం శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి... కావాలనే ఎవరైనా అతన్ని హుస్సేన్ సాగర్​లో తోసి వేశారా?... లేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయొద్దు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details