తెలంగాణ

telangana

ETV Bharat / crime

నీటి సంపులో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం లభ్యం - hyderabad district news

నీటి సంపులో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం లభ్యమైన ఘటన చందానగర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స‌ద‌రు మృత‌దేహం ఎవ‌రిది.. ఎందుకు సంపులో ప‌డి ఉంది.. ఎవ‌రైనా హ‌త్య చేశారా లేకా ప్ర‌మాద‌వశాత్తు ప‌డిపోయాడా అనే విష‌యం తెలియాల్సి ఉంది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

unidentified man body was found in a water pump in apartment at Hyderabad
నీటి సంపులో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం లభ్యం

By

Published : Mar 4, 2021, 7:32 AM IST

హైదరాబాద్​ చందానగర్​లోని హేమదుర్గ శారదా గెలాక్సీ అపార్ట్​మెంట్​లోని నీటి సంపులో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం లభ్యమయింది. దుర్గంధం వ‌స్తుండ‌టంతో అపార్ట్‌మెంట్ వాసులు సంపులోకి తొంగి చూడ‌గా... ఓ వ్య‌క్తి మృత దేహం ఉంద‌ని గుర్తించారు. వెంట‌నే పోలీసులకు స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృత‌దేహాన్ని బయటకు తీశారు.

మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు నాలుగు రోజుల నుంచి సంపులోనే ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. 40 నుంచి 45 ఏళ్లు గ‌ల స‌ద‌రు మృత‌దేహం ఎవ‌రిది.. ఎందుకు సంపులో ప‌డి ఉంది.. ఎవ‌రైనా హ‌త్య చేశారా లేకా ప్ర‌మాద‌వశాత్తు ప‌డిపోయాడా అనే విష‌యం తెలియాల్సి ఉంది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:వేట కొడవలితో అన్నను నరికి చంపిన తమ్ముడు

ABOUT THE AUTHOR

...view details