తెలంగాణ

telangana

ETV Bharat / crime

ముళ్లపొదల్లో కాలిపోయిన యువకుడి మృతదేహం లభ్యం - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

ఓ వ్యక్తిని హత్యచేసి ముళ్లపొదల్లో దహనం చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతదేహాం గుర్తుపట్టలేని విధంగా 90శాతం కాలిపోయి ఉందని పోలీసులు తెలిపారు.

unidentified dead body was found in the nirmal district
ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

By

Published : Jan 27, 2021, 5:25 PM IST

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామ శివారులో 90శాతం కాలిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం స్థానికులకు కనిపించింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్​స్క్వాడ్​ను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ముళ్ల పొదల్లో పడేసి తగలబెట్టారని నిర్మల్​ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు.

మృతదేహం గుర్తు పట్టలేని విధంగా కాలిపోయి ఉందని అన్నారు. చనిపోయిన వ్యక్తి పురుషుడని, దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని వెల్లడించారు. జీన్స్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడని, చుట్టు పక్కల ఎవరైనా తప్పిపోయి ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

ఇదీ చదవండి: ఫిట్​మెంట్ పేరుతో ఊరించి.. ఉసూరుమనిపించారు: సంజయ్

ABOUT THE AUTHOR

...view details