నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని శివారు ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. ఉట్కూరు గ్రామానికి చెందిన కావాలికారి వీఆర్ఏ శ్రీనివాస్ విధినిర్వహణలో భాగంగా తనిఖీ చేస్తుండగా... శివారు ప్రాంతంలో పూల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించాడు. పోలీసులకు సమాచారం అందించారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు - గుర్తుతెలియని మృతదేహం
ఉట్కూరు మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని మక్కల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి... మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు చామనఛాయ రంగులో ఉన్నాడని.. నీలం రంగు లుంగీ, తెల్ల చొక్కా ధరించినట్లు పేర్కొన్నారు. ఆనవాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
ఇదీ చూడండి:ట్రాక్టర్ ట్రాలీ లింక్ ఊడి.. 30 మంది మిర్చి కూలీలకు గాయాలు