సికింద్రాబాద్ చిలకలగూడ ఎక్స్ రోడ్డు వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి... గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి 40 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని మృతదేహం - గుర్తుతెలియని మృతదేహం
కుళ్లిపోయిన స్థితిలో ఉన్న గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన ఘటన చిలకలగూడ ఎక్స్ రోడ్డు వద్ద జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని మృతదేహం
మృతుడు స్థానికంగా ఉండే ఖిల్లా వద్దకు వచ్చి ఉంటాడని... అక్కడ గుండెనొప్పి రావటంతో బయటకు వచ్చి చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:బ్రెజిల్లో 4 లక్షలు దాటిన కరోనా మరణాలు