నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం నల్లగట్టు మరెమ్మ ఆలయం సమీపంలో ఉన్న క్రషర్ మిషన్ క్వారీలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం కుళ్లి పోవడంతో గుర్తుపట్టలేనంతగా ఉందని పేర్కొన్నారు.
క్వారీలో గుర్తుతెలియని మృతదేహం - telangana crime news
ఓ దేవాలయం సమీపంలో ఉన్న క్రషర్ మిషన్ క్వారీలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

క్వారీలో గుర్తుతెలియని మృతదేహం
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని మాగనూర్ ఎస్సై శివ నాగేశ్వర్ తెలిపారు.
ఇదీ చూడండి:కోనేరులో మునిగి యువకుడు మృతి