వృద్ధ దంపతులపై పెట్రోల్ పోసి నిప్పు.. అల్లుడే చేశాడా? - son inlaw killed his in laws
09:31 October 10
అత్తమామలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు
ప్రేమించాడు.. జీవితాంతం గుండెల్లో పెట్టి చూసుకుంటానని మాటిచ్చాడు. వేదమంత్రాలు.. అశేష బంధుగణం సాక్షిగా మూడుముళ్లు వేశాడు. పెళ్లైన కొన్నాళ్లకే వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధిస్తున్నాడని ఆ మహిళ తల్లిదండ్రుల వద్ద తన గోడు వెల్లబోసుకుంది. కంటికిరెప్పలా చూసుకున్న తన కూతుర్ని కష్టపెడుతున్నాడని తెలియగానే ఆ తల్లిదండ్రుల గుండె పగిలింది. అల్లుడిపై కోపం వచ్చింది. సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఫిర్యాదు చేశారన్న కోపంతో అతడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తామామలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. కూతురిని వేధిస్తున్నారని కేసు పెట్టిన కారణంగా అత్తమామలపై అల్లుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 2016లో నిఖిత, సాయికృష్ణలు ప్రేమించి వివాహం చేసుుకన్నారు. కొన్ని రోజుల తర్వాత వేధింపులకు గురిచేస్తున్నాడంటూ... సాయికృష్ణపై తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యను దూరం చేసి కేసు పెట్టించారని భావించిన సాయికృష్ణ... శనివారం అత్తగారింటికి వచ్చి వారితో వాగ్వాదానికి దిగాడు. వెంట తెచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించటంతో..... సాగర్‌రావు, రమాదేవిలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.