తెలంగాణ

telangana

ETV Bharat / crime

murder attempt: అల్లుడిపై కత్తితో దాడి చేసిన మామ

అల్లుడిపై మామ కత్తితో దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో జరిగింది. చెడు వ్యసనాలకు బానిసైన అల్లుడు.. నిత్యం తన కుమార్తెను వేధిస్తోన్న క్రమంలోనే ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.

murder attempt
murder attempt

By

Published : Oct 9, 2021, 3:29 PM IST

చెడు వ్యసనాలకు బానిసై నిత్యం తన కుమార్తెను వేధిస్తోన్న అల్లుడిపై.. మామ, బావమరిది తీవ్రంగా దాడి చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో ఈ ఘటన జరిగింది.

తుమ్మలచెరువుకు చెందిన చిన్న కాశిం నిత్యం భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. తన ప్రవర్తన మార్చుకోవాలని కుటుంబీకులు చెప్పినప్పటికీ అతను మారలేదు. ఈ విషయంలో మామ, అల్లుడి మధ్య ఘర్షణ జరిగింది.

ఈ ఘర్షణలో చిన్న కాశింపై అతని మామ, బావ మరిది కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చిన్న కాశింను చికిత్స నిమిత్తం పిడుగురాళ్లలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మామను, బావమరిదిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంలో కుటుంబసభ్యులు రాజీ పడినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:CCTV Footage Of Kidnap : షాపింగ్​కు వెళితే మూడేళ్ల పాపను ఎత్తుకెళ్లారు.. సీసీ టీవీ పుటేజీలో...

ABOUT THE AUTHOR

...view details