ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిడివాడ పాతూరులో ఓ మామ అల్లుడిని చంపాడు. పెయింటర్‌గా పనిచేసే కొత్తపల్లి చిన్న అనే వ్యక్తిని మామ శంకర్ హత్య చేశాడు. మద్యం మత్తులో అల్లుడితో మామ శంకర్, బావమరిది అశోక్ గొడవపడ్డారు. కొద్దిసేపటికే ఘర్షణ పెద్దదైంది.
దారుణం: మద్యం మత్తులో అల్లుడిని చంపిన మామ - చిన్నముసిడివాడ పాతూరులో అల్లుడి హత్య
మద్యం మత్తులో అల్లుడినే కొట్టి చంపాడో మామ. ఈ ఘటన ఏపీ విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిడివాడ పాతూరులో జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
![దారుణం: మద్యం మత్తులో అల్లుడిని చంపిన మామ uncle-killed-son-in-law-at-chinnamusidivada-pathuru in andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11068847-295-11068847-1616129817869.jpg)
దారుణం: మద్యం మత్తులో అల్లుడిని చంపిన మామ
విచక్షణ కోల్పోయిన మామ రాడ్డుతో అల్లుడి తలపై బలంగా కొట్టగా.. చిన్న అక్కడిక్కడే మృతి చెందాడు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి.జోగులాంబ ఆలయం హుండీ ఆదాయం 50లక్షల పైనే...