తెలంగాణ

telangana

ETV Bharat / crime

Murder attempt on girl: ఆస్తి కోసం దారుణం.. బాలికకు పురుగుల మందు తాగించిన బంధువులు - కర్నూలు జిల్లా తాజా వార్తలు

Murder attempt on girl: ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారన్న దానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. ఆస్తి కోసం అయినా వారే బరి తెగించారు. అన్నెం పున్నెం ఎరుగని బాలికను అంతమొందించేందుకు యత్నించారు. పొలానికి వెళ్లిన బాలికపై హత్యాయత్నానికి పాల్పడ్డారు.

Murder attempt on girl
ఆస్తి కోసం బాలికకు పురుగుల మందు తాగించిన బంధువులు

By

Published : Apr 14, 2022, 4:15 PM IST

Murder attempt on girl: ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామంలో ఆస్తి వివాదం ఓ బాలిక ప్రాణాల మీదకు తెచ్చింది. ఆస్తి కోసం బాలికపై పెదనాన్న వరుసయ్యే వ్యక్తే హత్యాయత్నం చేశాడు. పొలం వద్దకు వెళ్లిన బాలికకు పెదనాన్న, పెద్దమ్మ కలిసి పురుగుల మందు తాగించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఇస్వి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఆస్తి కోసం ఘర్షణకు దిగారని బాలిక తండ్రి ఆరోపించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details